బాహుబలి, సైరా, సాహో లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటేసి ప్రపంచవ్యాప్తంగా వెళ్లిపోతుంటే మరో వైపు బూతు సినిమాలు, అడల్ట్ సినిమాలు తీస్తూ మన రేంజ్‌ను బూతుకు పరిమితం చేసే దర్శకులు కూడా ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఇండస్ట్రీలో బూతు, బీ గ్రేడ్ తరహా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి.
ఇక తెలుగు సినిమాల్లో ఇటీవల ఎక్కువుగా వినిపించిన బీ గ్రేడ్ సినిమా ఏడు చేపల కథ. అసలు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యే వరకు ఈ టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కుతుందన్న విషయమే ఎవ్వరికి తెలియదు. ఇక టీజర్‌కు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా టార్గెట్ ఆడియెన్స్‌కు ఎలా కనెక్ట్ అయ్యిందో ? ఎంత రచ్చ చేసిందో ఊహించుకోవచ్చు.
సేమ్ రెండో టీజర్ కూడా అంతే రచ్చ చేసింది. ఇక సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు ట్రైలర్ చూస్తుంటే ఇది ట్రైలరా లేదా ఓ సెమీ ఫోర్న్ టైప్ సినిమా చూస్తున్నామా ? అన్న సందేహం రాక మానదు.
అసలు తెలుగు సినిమా ఇప్పుడు ఎటు వైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. అడల్ట్ కామెడీలు పక్క ఇండస్ట్రీలో వచ్చినపుడు చూసి ఏదేం కర్మ అనుకున్న వాళ్లు ఇప్పుడు తెలుగులో అంతకు మించిన కథలతో సినిమా వస్తుంటే నోరెళ్ల బెడుతున్నారు.
స్యామ్ జే చైతన్య తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు సినిమా అడల్ట్ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. బూతు సినిమాలు కూడా బిత్తరపోయేలా ట్రైలర్ కట్ చేసాడు దర్శకుడు. ఇక బిగ్‌బాస్ భాను శ్రీ కూడా మరో స్థాయిలో రెచ్చిపోయింది. అసలు ఈ సినిమాకు ఎన్ని సెన్సార్ కట్స్ పడుతాయో గాని.. ఏ ఏ ఏ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయొచ్చు.