అవును .. సుశాంత్ , సారా అలీఖాన్ ప్రేమలో పడ్డారు !

-

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ గురించి అతని స్నేహితుడు శామ్యూల్​ హౌకిప్​ కొన్ని ఆశ్చర్యకర విషయాలు పంచుకున్నాడు. ‘కేదార్​నాథ్​’ చిత్రీకరణలో సుశాంత్​, సారా అలీఖాన్​లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారని శామ్యూల్​ సోషల్​మీడియాలో వెల్లడించాడు. సుశాంత్​ నటించిన ‘సోంచిరియా’ చిత్రం విడుదల వరకు ఈ బంధం కొనసాగిందని ఇన్​స్టాగ్రామ్​లో తెలిపాడు.

sara-sushant
sara-sushant

సుశాంత్​, సారా.. ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై నటి కంగనా రనౌత్​ టీమ్​ ట్విట్టర్​లో స్పందించింది. “సుశాంత్​, సారాల ప్రేమ వ్యవహారం మీడియాకు తెలుసు. అవుట్​డోర్​ షూటింగ్​లకు వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఇలాంటి హాని కలిగించే ఫ్యాన్సీ నెపోటిజం వ్యక్తులు బయటివారికి కలలు చూపిస్తూ.. వారిని బహిరంగంగా ఎందుకు వదిలేస్తున్నారు?” అని ప్రశ్నించింది కంగనా రనౌత్​ టీమ్​.సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​, సారా అలీఖాన్​ల ప్రేమ వ్యవహారం గురించి గతంలో ప్రచారం జరిగింది. కానీ, దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం శామ్యూల్​ చేస్తున్న వాదనలు బీటౌన్​లో అలజడి సృష్టిస్తున్నాయి. అయితే ఈ విషయంపై నటి సారా అలీఖాన్​ ఏ విధంగా స్పందిస్తుందోనని సుశాంత్​ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

We accept the love we think we deserve -Stephen Chbosky

A post shared by Samuel Haokip (@jamlenpao) on

Read more RELATED
Recommended to you

Latest news