మొబైల్స్ తయారీదారు లావా భారత్‌లో పల్స్ పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. బీపీ, హార్ట్‌రేట్ సెన్సార్లు ఉన్న ప్రపంచంలోనే తొలి ఫీచర్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ ముందు భాగంలో కీ ప్యాడ్‌పై ఉండే పల్స్ స్కానర్‌పై చేతి వేలిని ఉంచితే చాలు. వెంటనే బీపీ, హార్ట్ రేట్‌లను ఫోన్ గుర్తించి తెరపై ప్రదర్శిస్తుంది. ఆ వివరాలను ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. లేదా ఆ డేటాను మెసేజ్‌ల రూపంలో ఇతర ఫోన్లకు పంపుకోవచ్చు.
ఇక ఈ ఫోన్ పల్స్ సెన్సార్ రీడింగ్స్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ హార్ట్ రేట్, బీపీ సెన్సార్‌ల మాదిరిగా కచ్చితత్వంతో పనిచేస్తాయని లావా వెల్లడించింది.
లావా పల్స్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్లు…
* 2.4 ఇంచుల డిస్‌ప్లే, 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 32 ఎంబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* పాలీ కార్బనేట్ బాడీ విత్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్
* డ్యుయల్ సిమ్, 2జి, బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ పోర్ట్
* కెమెరా విత్ వీడియో రికార్డింగ్, నంబర్ టాకర్, ఫొటో ఐకాన్స్ ఫర్ కాంటాక్ట్స్
* వైర్‌లెస్ ఎఫ్ఎం విత్ రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్
* 22 భారతీయ భాషలకు సపోర్ట్
* 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
లావా పల్స్ ఫీచర్ ఫోన్ ధర రూ.1599గా ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.