కంగనాకు యోగీ స్పెషల్ గిఫ్ట్..మురిసిపోయిన బ్యూటీ..!

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బిజెపి సపోర్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంగనా రనౌత్ బీజేపీపై ఇండస్ట్రీ నుండి ఎవరు విమర్శలు చేసినా వారిపై ఫైర్ అవుతుంటుంది. మోడీ సర్కార్ తీసుకువచ్చే పథకాల పై ప్రశంసలు కురిపిస్తుంది. ఇక బీజేపీని సపోర్ట్ చేసే కంగనా తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా ఆయన నివాసానికి వెళ్ళి కలిసింది. ఈ విషయాన్ని కంగానా సోషల్ మీడియాలో పంచుకుంది.ఈ సందర్భంగా కంగనాకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ జన్మభూమి పూజ లో ఉపయోగించిన రామ దర్బార్ ను బహుమతిగా ఇచ్చినట్టు కంగనా పేర్కొంది. అంతేకాకుండా వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా గెలవాలని కోరుకున్నట్టు కంగనా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కంగనా హీరోయిన్ గా నటించిన తలైవి సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news