హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…గెల్లు శ్రీను గెలుపు శ్రీను కాబోతున్నాడని వ్యాఖ్యానించాడు. కేసీఆర్ కు నీతి లేదు అని ఈటల రాజేందర్ అంటున్నాడు.. ఈటల రాజేందర్ కే రీతి లేదని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కు ఘోరీ కడతా అంటున్న ఈటలకే నీతి, జాతిలేదు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

బీజేపీని తిట్టిన ఈటల… బీజేపీలో చేరడం ఏనీతి..?నాపుట్టుకే వామపక్షం అన్న ఈటలకు సిద్ధాంతం గుర్తు రాలేదా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. పదవి కోసం ఈటల అన్నింటిని పక్కన బెట్టారని..ధరలు పెంచి రైతులపై ఆర్థికభారం మోపుతున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. మాటతప్పని మడమతిప్పని నేత కేసీఆర్ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు.