అఖిలేష్ యాదవ్‌పై యోగి ఆదిత్యనాథ్ సెటైర్లు

-

ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెటైర్లు వేశారు. అఖిలేష్ యాదవ్‌కు రాహుల్ గాంధీకి మధ్య పెద్ద తేడా లేదన్నారు. అయితే వీరిద్దరి మధ్యలో ఒక్క తేడా మాత్రం కామన్‌గా ఉందన్నారు. రాహుల్ గాంధీ దేశం వెలుపల, అఖిలేష్ యాదవ్ రాష్ట్రాల వెలుపల రాష్ట్రానికి చెడు చేస్తారని సీఎం యోగి ఆరోపించారు. మంగళవారంతో ఉత్తరప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

సీఎం యోగి ఆదిత్యనాథ్

ఈ సందర్భంగా బడ్జెట్ సెషన్‌ టైంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు ప్రతిపక్ష నాయకులపై సీఎం యోగి విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ విదేశాల్లో భారత్‌కు చెడు చేస్తున్నాడని, అఖిలేష్ యాదవ్ యూపీ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లి చెడు చేస్తున్నాడని పేర్కొన్నారు. కాగా, అఖిలేష్ యాదవ్ సోమవారం బడ్జెట్‌ సెషన్‌లో ప్రాథమిక విద్యపై మాట్లాడారు. తనకు ఎదురైన ఒక సంఘటనపై ప్రస్తావించారు. ఒక సారి తను పాఠశాలకు వెళ్లి నేను ఎవరో తెలుసా? అని పిల్లాడిని అడిగానని, అప్పుడు ఆ పిల్లాడు మీరు రాహుల్ గాంధీ అని చెప్పారని పేర్కొన్నారు. దీంతో సభలో అందరూ నవ్వుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version