మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం పెట్టిన యోగి

-

2022 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే అది యూపీ ని కైవసం చేసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది అని రాజకీయ వర్గాల నమ్మకం.

అటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 43 ఏళ్లలో ఏ పార్టీ వరుసగా రెండో సారి అధికారం లోకి వచ్చిన దాఖలు లేవు. ఆ నమ్మకాన్ని పంటపంచెలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.

 

యూపీ ఎన్నికల్లో మునుపటి కంటే సీట్లు తగ్గినా వరుసగా రెండో సారి అధికారంలోకి రావడానికి కారణం ముఖ్యమంత్రి యోగి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లే అని అందరికి తెలుసు.

 

ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన తర్వాత యోగి ఢిల్లీ వెళ్లి మోడీ ని కలుసుకున్నారు. పార్టీ గెలిపించడంలో యోగి కృషి ని అభినందించారు. మోడీ ని కలిసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, అమిత్ షాలను కలిసి రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు గురించి చర్చించారు. త్వరలోనే మంత్రి వర్గ ఏర్పాటు జరగబోతోంది అని నడ్డా, షా లతో సమావేశ అనంతరం మీడియా సమావేశంలో పేర్కొన్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version