ఎస్… పెరుగు తింటే బీపి తగ్గుతుంది…!

-

బీపీ… ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. సెల్ ఫోన్ లేని వాడు బీపీ షుగర్ లేని వాడు ఎక్కడా పెద్దగా కనపడటం లేదు. బీపి మన శరీరంలోకి అడుగు పెట్టింది అంటే చాలు ఎన్నో రకాల సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. బీపి అడుగు పెట్టగానే ఆటోమేటిక్ గా సమస్యలు కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలకు కూడా ప్రమాదకరం.

కాబట్టి బీపి ఉన్న వారు కాస్త ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇక ఆహారం విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా కీలకం. లేకపోతే ఎదురయ్యే సమస్యలు కూడా చాలానే ఉంటాయి. కోరికలను అదుపు చేసుకోకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడటం అనేది ఖాయమని అంటూ ఉంటారు వైద్యులు. ఇక బీపీ అదుపులో ఉండాలి అంటే ఒక చిన్న పరిష్కారం ఉందని అంటున్నారు.

ఇక ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడం చాలా మంచిది. అయితే బీపీ అదుపులో ఉండటానికి పెరుగు ఎంతగానో సహకరిస్తుందని అంటున్నారు.. బీపీ ఉన్న వారు వారు పెరుగుని తినడం వల్ల సమస్య చాలా వరకూ అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పెరుగుని నేరుగా అయినా తీసుకోవచ్చు లేదా మజ్జిగలా చేసుకుని తాగొచ్చు. ఇక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమ౦.

Read more RELATED
Recommended to you

Latest news