ఖ‌‌గోళ అద్భుతం‌.. టెలిస్కోప్ లేకుండానే 5 గ్ర‌హాల‌ను చూడొ‌చ్చు..

-

ఆకాశంలో అప్పుడ‌ప్పుడూ అద్భుత‌మైన ఖ‌గోళ వింత‌లు చోటు చేసుకుంటాయి. అయితే కొన్ని దృశ్యాల‌ను చూసేందుకు టెలిస్కోపులు అవ‌స‌రం అవుతుంటాయి. కానీ వ‌చ్చే వారం ఆకాశంలో చోటు చేసుకోనున్న ఖ‌గోళ అద్భుతాన్ని చూసేందుకు టెలిస్కోపులు కూడా అవ‌స‌రం లేదు. వ‌చ్చే వారం ఖగోళంలో జ‌ర‌గ‌నున్న అద్భుతాన్ని వీక్షించేందుకు భూమి మీద ఎక్క‌డ ఉన్నా చాలు. ఇక ఆ అద్భుతాన్ని టెలిస్కోపులు లేకుండానే చూడ‌వ‌చ్చ‌ని హైద‌రాబాద్‌కు చెందిన సైంటిస్టు ఒక‌రు తెలిపారు.

వ‌చ్చే వారంలో ఆకాశంలో ఒక అద్భుతం చోటు చేసుకోబోతోంది. మొత్తం 5 గ్ర‌హాల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా వాటిని ఆకాశంలో నేరుగా వీక్షించ‌వ‌చ్చు. అందుకు టెలిస్కోపులు కూడా అవ‌స‌రం లేదు.. అని హైద‌రాబాద్‌కు చెందిన సైంటిస్టు బీజీ సిద్ధార్థ తెలిపారు.

బుధుడు, శుక్రుడు, అంగార‌కుడు, బృహ‌స్ప‌తి, శ‌ని గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలో చూడ‌వ‌చ్చ‌ని సిద్ధార్థ తెలిపారు. అలాగే టెలిస్కోపు ఉంటే యురేన‌స్‌, నెప్ట్యూన్‌, ప్లూటో గ్ర‌హాల‌ను కూడా మ‌నం అంత‌రిక్షంలో వీక్షించ‌వ‌చ్చ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version