ఈ హెడ్ సెట్ తో నొప్పుల‌న్నీ మ‌టుమాయం.. షాకింగ్ రిజల్ట్స్‌..!!

-

మానవాళి జీవనశైలిలో పూర్వంతో పోల్చుకుంటే గుణాత్మక మార్పులు సంభవించాయి. ఆహారపు అలవాట్ల నుంచి మొదలుకుని నిద్ర వరకు అన్ని విషయాల్లోనూ మార్పులొచ్చాయి. ఉరుకుల పరుగుల జీవనంలో తినే తిండిపై శ్రద్ధ వహించే సిచ్యువేషన్స్ తక్కువగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పిల్లల నుంచి మొదలుకుని పెద్దల వరకు అందరూ రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు సైతం రకరకాల నొప్పులకు కేరాఫ్ అవుతున్నారు. అయితే, నొప్పులు తగ్గించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతుండటం మనం చూడొచ్చు. వాటి వాడం కల్ల పెయిన్ రిలీఫ్ లభిస్తుంది. కానీ, రెగ్యులర్ యూసేజ్ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో పెయిన్స్ తగ్గించేందుకు గాను సైంటిస్టులు వినూత్న ఆవిష్కరణ చేశారు. ఆ ఆవిష్కరణ ఏంటి? తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

Pain Killer Headset

మనుషుల నొప్పులు తగ్గించేందుకు గాను శాస్త్రవేత్తలు హెడ్‌సెట్ రూపొందించారు. అవునండీ..ఈ హెడ్ సెట్‌ను ఎనిమిది వారాల పాటు ధరిస్తే చాలు..మీ నొప్పులు ఇట్టే నయమవుతాయట. మంచి నిద్ర రావడంతో పాటు రోగుల మెంటల్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతాయి. జీవన ప్రమాణాలూ మెరుగుపడతాయి. మనుషులకున్న ఆందోళన, నిరాశ హెడ్‌సెట్ ధారణ వల్ల తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

ఎలక్ట్రో ఎన్సెఫలో‌గ్రామ్ అనే టెక్నాలజీ సాయంతో రూపొందించబడిన ఈ హెడ్‌సెట్ హ్యూమన్ బ్రెయిన్ వెవ్స్ రీడ్ చేస్తుంది. నొప్పిని ఎదుర్కోవడానికి మెదడును సిద్ధం చేస్తుంది. ఫలితంగా నొప్పులు తగ్గిపోతాయి. హెడ్‌సెట్‌లో ఉండే ఎనిమిది ఎలక్ట్రోడ్లు మెదడులోని విద్యుత్ కార్యకలాపాలు, తరంగ ధైర్ఘ్యాలను పరిశీలిస్తాయి. హెడ్‌సెట్‌లోని ఎలక్ట్రోడ్స్ ఆధారంగా హ్యూమన్ బ్రెయిన్ డేటా ఫుల్లీ ఆటోమేటిక్‌గా రీడ్ అవుతుంది. న్యూరోఫీడ్ బ్యాక్ థెరపీ కూడా ఈ హెడ్‌సెట్‌తో చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మెదడు నరాల పని తీరు మెరుగవడంతో పాటు నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు మార్కెట్‌లో ఈ డివైజ్ అందరికీ అవెయిలబుల్‌గా ఉండే చాన్సెస్ ఉంటాయి. న్యూజిలాండ్‌లో ఈ హెడ్‌సెట్‌పై పరిశోధకులు ఇంకా పూర్తిస్థాయి రీసెర్చ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version