ఒలింపిక్స్‌లో పీవీ సింధు బోణీ.. ఇజ్రాయిల్ షట్లర్‌పై విజయం

-

టోక్యో: ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు బోణీ కొట్టారు. గ్రూప్ జె తొలి మ్యాచ్‌లో సింధు శుభారంభం చేశారు. 21-7, 21-10 తేడాతో పీవీ సింధు గెలుపొందారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై విజయం సాధించారు.

మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరశ మిగిలింది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మనుబాకర్ 12వ స్థానంలో నిలిచారు. యశస్విని 13వ స్థానంలో ఉన్నారు. ఇక ఒలింపిక్స్ భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరబ్ చౌదరీ అర్హత సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version