చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం.. ఇద్ద‌రు మృతి.. ప‌ది మందికి గాయాలు..

-

త‌మిళ‌నాడు ప్రజల సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ‘జల్లికట్టు’ను సుప్రీంకోర్టు నిషేధించినా పోరాడి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అనుమతి తెప్పించున్నారు తమిళులు. ఈ క్రీడకు చెన్నై, మధురై పరిసర ప్రాంతాల్లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రాణాలు పోతాయని తెలిసినా ఎద్దులతో పోరాడేందుకు సై అంటారు. కొన్నిసార్లు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం జరిగింది. రామకుప్పం మండలంలో జల్లికట్టు ఆడేందుకు భారీగా యువకులు తరలివచ్చారు.

అయితే ఈ రాక్షస క్రీడలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ యువకుడిపై ఎద్దు బలంగా దూసుకెళ్లడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జల్లికట్టుకు పోలీసులు అనుమతి లేదని చెబుతున్నా కూడా గ్రామాల్లో మాత్రం యధేచ్ఛగా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version