నేటితరం యువత ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు పరీక్ష ఫెయిల్ అయ్యామని.. ప్రేమలో ఓడిపోయామని.. ర్యాంకులు రాలేదని.. ఇంట్లో పేరెంట్స్ తిట్టారని..సోషల్ మీడియా లైక్స్, వ్యూస్ రావడం లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తనకు ఫాలోవర్స్ తగ్గారని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన యూపీలోని లక్నోలో చేటుచేసుకుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడింది. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు లక్నోలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కుటుంబం వెల్లడించింది. మిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడం వల్ల తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌లో ఉందని సోదరి ముక్తా అగర్వాల్ తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్..!
తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు లక్నోలో ఆత్మహత్య చేసుకున్న మిషా.
ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన ఆమె కుటుంబం.
మిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల… pic.twitter.com/XJm1uwRJ1p— ChotaNews App (@ChotaNewsApp) May 3, 2025