టాలీవుడ్ లో విషాదం.. యువ రచయిత మృతి

-

కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే మన దేశంలో కరోనా కేసులు కోటికి చేరువయ్యాయి. అయితే ఈ కరోనా వలన ఎక్కువ మంది కోలుకుంటున్నా సరే సమస్యలు ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే అధిక భాగం అందరూ కోలుకుని బయటకు వస్తుండగా కొంత మంది మాత్రం మృత్యువాత పడడం ఆందోళన కలిగించే విషయం.

తాజాగా టాలీవుడ్లో వర్ధమాన రచయిత వంశీ రాజేష్ కొండవీటి అనే ఆయన ఈ కరోనా కారణంగా కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా కరోనా పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూసినట్టు సినీ వర్గాల నుండి సమాచారం. ఇక ఈయన రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రచయితగా పనిచేశారు. ఈ సినిమాని శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కాగాగా కాస్త డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఒక యవ రచయిత మరణించాడని తెలిసి టాలీవుడ్ షాక్కు గురైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version