కేరళలో యంగ్ ఎమ్మెల్యేతో యంగెస్ట్ మేయర్ వివాహం

-

దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్​ ఆర్యా రాజేంద్రన్ కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్​ను వివాహమాడారు. తిరువనంతపురంలోని ఏకేజీ సెంట్రల్ హాల్​లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్​వీ గోవిందన్, మంత్రులు శివన్​కుట్టి, మహ్మద్​ రియాజ్, ఆంటోని రాజు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇరువురు దంపతులు పూల దండలు మార్చుకున్నారు.

తమ పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురావొద్దని గతంలోనే చెప్పారు. తమకు గిఫ్ట్​లు ఇచ్చే బదులు అనాథ ఆశ్రమాలకు సాయం చేయాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్​కు డబ్బులు ఇవ్వాలని కోరారు. బలుస్సెరి అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్​గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించడం వల్ల పెళ్లి పీటలెక్కారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version