నీ క్యారెక్టర్ అశుద్ధం.. గీతూ పై ఫైర్ అవుతున్న రేవంత్..!

-

బిగ్ బాస్  సీజన్ 6లో ఒకవైపు సింగర్ రేవంత్.. మరొకవైపు గలాటా గీతూ ఇద్దరూ ఒక యుద్ధమే చేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు వీరిద్దరిని గొడవపడమని చెప్పారో ఏమో తెలియదు కానీ వీరిద్దరికీ అస్సలు గిట్టడం లేదు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తొమ్మిదవ రోజు హైలెట్స్ గా నిలిచిన విషయాల విషయానికి వస్తే.. శ్రీహాన్ ,రేవంత్ , అర్జున్ మధ్య సంభాషణతో 9వ రోజు ఎపిసోడ్ మొదలవుతుంది.. ఇక అందులో భాగంగానే శ్రీ సత్య తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ.. ఫ్రెండ్లీగా తనను భుజం మీద టచ్ చేసినా.. అలాగే సైడ్ హాగ్ ఇచ్చినా ఓకే.. అంతకుమించి నన్ను టచ్ చేయాలనే చూస్తే నేను సహించను అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో ఇనయ సుల్తానా మైక్ మిస్ అవుతుంది .గంట నుంచి వెతికినా కూడా కనిపించదు. చివరికి ఆ మైక్ ఆర్జే సూర్య వద్ద ఉంటుంది.

అప్పుడు సూర్య నే కావాలని తన మైకు దాచి పెట్టాడు అని ఇనయ కెప్టెన్ బాలాదిత్యకు కంప్లైంట్ చేస్తుంది. సరదా గొడవ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత అసలు గొడవ మొదలైంది. ఇక చలాకి చంటి హాయిగా రిలాక్స్ అవుతూ తనకు కనిపించిన వారందరిపై జోకులు వేస్తూ నవ్విస్తుంటారు.. ఇక చివర్లో నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ ప్రారంభిస్తారు. ఇంటి సభ్యులు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి వారి ఫోటోను కుండకు అతికించి . బావిలో పడేయాలి. అంతేకాదు నామినేట్ చేయడానికి గల కారణాన్ని కూడా చెప్పాలి అని చెబుతాడు. ఈ క్రమంలోని గీతూని శ్రీహాన్, చంటి, రేవంత్, పింకీ వంటి వారు నామినేట్ చేస్తారు. ఇక రేవంత్ ని గీతూ, ఫైమా, అర్జున్, కీర్తి నామినేట్ చేస్తారు.

ఈ క్రమంలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, షాని, అభినయ, రోహిత్ , మేరీనా , ఆదిరెడ్డి, గీతూ, రేవంత్, ఫైమా కూడా ఈ వారం నామినేట్ అయ్యారు. ఇందులో భాగంగానే రేవంత్, గీతూ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది . ఒకరి క్యారెక్టర్ మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు . తాను ఎవరికోసమో మారిననీ గీతూ అంటే .. అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను.. చీ చీ..అసలు నేనేంటి ఈ పిల్లను నామినేట్ చేసేది అనుకున్న అని రేవంత్ తెలిపాడు. అంతేకాదు ఎక్స్ట్రాలు చేయొద్దని గీతూ అంటే అశుద్ధం మీద రాయి వేస్తే నా మీద పడుతుంది అలాంటి క్యారెక్టర్ నువ్వు అంటూ గీతూ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు రేవంత్.

Read more RELATED
Recommended to you

Latest news