యూట్యూబర్ మరియు కంటెంట్ క్రియేటర్ అయిన లిల్లీ సింగ్ గ్రామీ అవార్డు వేడుకలో ధరించిన మాస్క్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మాస్క్ మీద ఐ సపోర్ట్ ఫార్మర్స్ అని రాసి ఉంది. భారతదేశంలో రైతు నిరసనకు తన మద్దతును లిల్లీ సింగ్ ఇలా చూపించింది. దీనికి సంబంధించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పేర్కొంది.
“రెడ్ కార్పెట్ / అవార్డు షో చిత్రాలు ఎల్లప్పుడూ ఎక్కువ కవరేజీని పొందుతాయని నాకు తెలుసు, కాబట్టి మీడియా మీరు చూసిన దానిని ప్రజలకు చేరవేయండి, సంకోచించకండి. #IStandWithFarmers #GRAMMYs” అని ఆమె రాసుకోచ్చింది. ఆమె ఫోటోను షేర్ చేసిన ఒక గంటలోపే, ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 52,000 మందికి పైగా “లైక్ చేశారు”. మోడల్ అమండా సెర్నీ, డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ సునీల్ సింగ్ కూడా ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. పంజాబ్ మూలాలు ఉన్న ఈ కెనడియన్ ఇండియన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో తొమ్మిది మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 14 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్ లు ఉన్నారు.