ఏఐ, రోబోటిక్స్‌తోపాటు ఇంటర్‌లో 9 కొత్త కోర్సుల వివరాలు!

-

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ బోర్డు టెక్నాలజీ కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులకు ఏఐ, రొబోటిక్‌తోపాటు మరి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ఇకపై పదవతరగతి పూర్తికాగానే ఎంపీసీ, బైపీసీ అంటూ మామూలు కోర్సులు కాకుండా విభిన్నమైన టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆలోచనతో భవిష్యత్తు మొత్తం టెక్నాలజీ కోర్సులదే అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ విధమైన కోర్సులకు డిమాండ్‌ బాగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని… టెక్నాలజీపై విద్యార్థులకి నాలెడ్జ్‌ పెంచేందుకు ఇంటర్‌ బోర్డు… కొన్ని షార్ట్‌ టెర్మ్‌ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. ఇవి మొత్తం 9 కోర్సులు ఉన్నాయి. వీటిని వేసవి సెలవులు అయిపోయాక.. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. వీటికి సంబంధించిన సిలబస్‌ను ఇదివరకే సిద్ధం చేసేసింది.

జనవర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌) ప్రొఫెసర్లకు ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్‌ను తయారుచేయనుంది. వారు పరిశీలించి ఎలా ఉందో చూసి, ఏమైనా మార్పులు చేయాలంటే సలహాలు చెబుతారు. వేసవిలోనే ఈ మార్పులు జరిగిపోతాయి. సరిగ్గా కాలేజీలు తెరవగానే కొత్త కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి ఏడాదిపాటు చదివే కోర్సులు కావు. కొంతకాలమే ఉంటాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన పెరుగుతుంది. వారు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు వీలవుతుంది. స్వల్పకాలిక కోర్సు నచ్చితే… అప్పుడు పూర్తి స్థాయిలో అదే కోర్సును చదివి… అందులోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవచ్చు.

 

కొత్త కోర్సుల వివరాలు ఇలా..
1. కృత్రిమ మేధ (artificial intelligence)
2. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ
3. రోబోటిక్స్‌
4. మెషిన్‌ లెర్నింగ్‌
5. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ
6. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌
7. ఎంబెడ్‌ సిస్టమ్‌
8. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌
9. కోడింగ్‌

వీటిలో విద్యార్థులకు నచ్చిన కోర్సును చదువుకోవచ్చు. కచ్చితంగా భవిష్యత్తుకు ఇవి చాలా ఉపయోగపడతాయని అంటున్నారు. ఒక్కో కోర్సూ 3 – 9 నెలల వరకు ఉంటుంది. కోర్సుల్లో 60 శాతం ప్రాక్టికల్స్, 40 శాతం థియరీ ఉంటుంది. ఫీజు తక్కువగానే ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులు ఏ గ్రూపు చదువుతున్నా… అదనంగా ఈ కోర్సులు కూడా చేయవచ్చని తెలిపారు. మొదట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో వీటిని ప్రవేశపెడతారు.
ఇది విదేశాల్లో మాత్రమే ఈ తరహా కోర్సులు ఉండేవి. టెక్నికల్‌గా మన దేశ విద్యార్థులు మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version