ప్రమాదం జరిగినప్పుడు అక్కడ లేను : య్యూటబర్‌ నాని

-

విశాఖ హర్బర్‌ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ లేనని య్యూటబర్‌ నాని వెల్లడించారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనకు, తనకు సంబంధం లేదని యూట్యూబర్ నాని అన్నారు. ‘ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడ లేను. రాత్రి 11 తర్వాత నాకు ప్రమాదం గురించి సమాచారం అందింది. ప్రభుత్వానికి సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే నేను అక్కడికి వెళ్లాను. అందుకే వీడియో తీశాను’ అని వెల్లడించారు.

youtuber nani comments on visakha incident

కాగా, నాని తన భార్య సీమంతం అక్కడ చేసి, పార్టీ చేసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని తోలుత వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా… విశాఖలో బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి అందజేయనున్నారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకొని ఫిషింగ్ హార్బర్ లోని ఘటనా స్థలాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. బాధిత మత్స్యకారులతో పవన్ స్వయంగా మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version