ఏపీసీఎం జగన్ తీసుకున్న తీసుకున్న నిర్ణయంతో విజయనగరంలో రాజకీయ నేతలు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా టీడీపీ లో నాయకులు బయటకు కూడా రావడం లేదు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా ల్లో నూ సత్తా చాటాలని టీడీపీనిర్ణయించుకుంది. అయితే, దీనికి తగినట్టుగా నాయకులు ముందుకు రావడం లేదు. ఇదే పరిస్థితి వైసీపీలోనూ చోటు చేసుకోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే.. జిల్లాలోని ప్ర ధానమైన ఆరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ల పద వులను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడంతో ఓసీ, బీసీలకు చెందిన ఆశావాహుల ఆశలు ఆవిరయ్యాయి. రిజర్వేషన్ల జాబితాను చూసి వీరంతా ఖంగుతున్నారు. అధికార వైసీపీ నేతలైతే ఈ షాక్‌నుంచి తేరుకోలేకపోతున్నారు.
మున్సిపల్ స్థాయి (పట్టణా లుగా) ఉన్న శృంగవరపుకోట పంచాయతీ ఎస్టీ మ హిళ, కొత్తవలస ఎస్సీ జనరల్, చీపురుపల్లి ఎస్సీ మ హిళ, గజపతినగరం ఎస్సీ మహిళ, కొండపాలెం (గరివిడి) ఎస్సీ మహిళ, కురుపాం ఎస్టీ మహిళల కు కేటాయించారు. ఈ మేజర్ పంచాయతీలన్నిటినీ ఇటీ వలనగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. పట్టణ జనాభాతో సరి తూగేలా ఉన్న ఈ మేజర్ పంచాయతీలకు ప్రథమ పౌరుడిగా వ్యవహరించాలని ఏ రాజకీయ పార్టీనేత అయినా కోరు కోవడం సహజం. మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవి కంటే మిన్నగా ఈ స్థానాల్లో గౌరవ, మర్యాద లుంటాయి. దీంతో ఈ పంచాయతీల సర్పంచ్‌లుగా ఒక్కసారైన చేయాలని ఆశిస్తుంటారు.
అత్యధిక సా మాజిక వర్గం ఉన్న కుటుంబాలు ఈ పదవి ఆశిస్తూ సేవలందిస్తూ వస్తున్నారు. ఎప్పుడు పంచాయతీ పాలకవర్గాలు రద్దువుతాయా? ఎన్నికలు జరుగు తా యా? ఎప్పుడు ఈ పదవులను అధిరోహిస్తామా అన్ని ఆతృత పడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక ఇలాంటి పంచా యతీల్లో ఈసారి ఎన్నికల్లో అన్నీ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. గతంలో ఒకటో, రెండో ఎస్సీ, ఎస్టీలకు మిగిలిన వా టిని ఓసీ, బీసీలకు కేటాయించేవారు. పేరున్న పంచాయతీలన్నీ ఒకేసారి ఇలా ఏకంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ యిన సందర్భాలు లేవని పలువురు చెబుతు న్నారు. ఈ పంచాయతీలే కాక మిగిలిన మేజర్ పంచాయ తీల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కేటాయించారు.
ఈ పంచాయతీల్లో నివశించే మేజర్ సామాజిక వర్గానికి చెందినవారితోపాటు ఈ గ్రామం నుం చి మండల స్థాయిలో నాయకత్వం వహిస్తున్న ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారంతా సర్పంచ్ పద వులపై ఆశలు పెంచుకున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలంతా గత ఐదేళ్లగా ఈ సర్పంచ్ పదవుల కోసం తపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పాలక మండలిలు రద్దై ఏడాది దాటింది. అప్పటి నుంచి మేజర్ పంచాయతీ ఎన్నికలపై ఆశప డుతున్న ఓసీ, బీసీ నేతలు గ్రామాల్లో ఎవరికి ఏ పని కావాలన్న చేదోడువాదోడుగా ఉంటున్నారు. వైసీపీ నేతలు సామాజిక ఫించన్‌లు, బియ్యకార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల స్థల పట్టాలు వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదంతా కూడా తమకు స్థానికంలో మేలు చేస్తుందని అనుకున్నారు. అయితే, దీనికి విరుద్ధంగా అన్నీ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడంతో టీడీపీ, వైసీపీలోని అగ్రవర్ణాలు తలలు పట్టుకుంటున్నాయి. దీంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.