గ్రామ పంచాయతీల నిధులు అన్నీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీ.కే.కన్వెన్షన్ సెంటరర్ లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు.
పంచాయతీ రాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్నా.. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి అన్నారు. పల్లెల్లో ఉండటం అంటే ఇస్టం అన్నారు. కానీ కుదరలేదు. అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోంది. గతంలో చాలా తండాలలో పర్యటించాను. అభివృద్ధి చేయాలని నిర్ణయించామని.. చిన్న పైరవీలు చేసినా చర్యలు తప్పవు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు.