కే‌సి‌ఆర్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి దూసుకుపోతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాలు రద్దు చేయడం జరిగింది. మీడియా ముందు బాగా గొప్పగా చెప్పుకునే వైయస్ జగన్ సర్కార్ వాటిని అమలు చేసే విధానంలో సరైన స్పష్టత లేకపోవడంతో ప్రజలకు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు లో కొన్ని అమలుకు నోచుకోలేదు.

అమరావతి రైతుల ఆందోళన విషయంలో అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విషయంలో వైయస్ జగన్ సర్కార్ కి న్యాయస్థానాలు మొట్టికాయలు వెయ్యడం జరిగింది. పదే పదే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన గాని జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాల విషయంలో ఏ మాత్రం చేంజ్ రావటం లేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు ప్రభుత్వం అంటూ విమర్శలు సెటైర్లు చేస్తున్నారు. మరోపక్క రోడ్డు బడ్జెట్ కలిగిన రాష్ట్రం అని చెప్పి పక్కనే అంతమంది సలహాదారులు పెట్టుకుని లక్షల్లో జీతాలు ఇస్తూ సీఎం వైయస్ జగన్ చేస్తుంది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

కాగా ఈ విధంగానే కెసిఆర్ 2014లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన సమయంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్న నిర్ణయాలు విషయాల్లో తెలంగాణ న్యాయస్థానాల తో ఎక్కువసార్లు మొట్టికాయలు వెయించుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈ విధంగానే న్యాయస్థానాలు బ్రేక్ ఇవ్వటంతో కెసిఆర్ రికార్డుని జగన్ అధిగమిస్తూ దూసుకుపోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version