జగన్ ఫ్రెష్ ఆపరేషన్: బాబు వెళ్లడంలేదు.. వైకాపా ఆగడంలేదు!!

-

అటు 151.. ఇటు 23.. ఆ దెబ్బనుంచే బాబు ఇంకా తేరుకోలేదు! ఇంతలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తుంది అధికార పార్టీ! 2019 ఎన్నికలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా మరువక ముందే అరెస్టుల పర్వానికి తెరతీసింది ఏపీ ప్రభుత్వం. దీనికి తోడు కరోనా కష్టకాలం.. రాజకీయం ఆన్ లైన్ కే పరిమితం! ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది.. రాష్ట్రంలో ఏమి జరుగుతుంది.. ఏసీబీ నెక్స్ట్ ఎవరి ఇంటి తలుపు తట్టనుంది.. సీబీఐ ఎంక్వరీ ఎంతవరకూ వచ్చింది.. భూముల పంపిణీలో హైకోర్టు ఏమి తీర్పు ఇవ్వబోతోంది.. ఇవన్నీ చాలవన్నట్లు బాబుకు “ఫ్రెష్ టెన్స్షన్” ఒకటి స్టార్ అయ్యింది!


అవును… జగన్ చాప కింద నీరులా స్టార్ చేసిన ఒక కొత్త ఆపరేషన్.. “టార్గెట్ కుప్పం”! కరోనా సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోనూ, అమరావతిలోనూ రెస్ట్ తీసుకుంటుంటే… వైకాపా మాత్రం కుప్పంలో పాగా వేసే పనికి పూనుకుని “టార్గెట్ కుప్పం” ఆపరేషన్ ను స్టార్ చేసేసిందట. ఇప్పటికే పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ విషయంలో కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యూహాత్మకంగా ముందుకువెళ్లిన వైకాపా.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలిచి తీరాలనే ఆలోచనతో ముందుకు పొతున్నట్లు కనిపిస్తుంది!

ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ “టార్గెట్ కుప్పం” అనే ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని అంటున్నారు విశ్లేషకులు. అది జరిగే పనేనా.. అసలు అలాంటివి ఉంటాయా అనే అనుమానం వచ్చిన వారికి… 2019 ఫలితాల్లో జరిగిన ఒక ఆశ్చర్యకర విషయాన్ని చూపిస్తున్నారంట పెద్దిరెడ్డి!! వరుసగా 7సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటితో గెలుస్తూ వస్తున్న బాబుకి 2019 ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది. అంతే కాదు.. ఒకానొక సందర్భంలో ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ప్రత్యర్ధి కంటే వెనుకబడ్డారంట కూడా! ఇప్పుడు ఇదే వైకాపా నేతలకు బూస్ట్ లా పనిచేస్తుందని అంటున్నారు.

అంటే.. బలమైన వ్యూహాలు పన్ని, నమ్మకమైన నేతను వచ్చే ఎన్నికల్లో నిలబెడితే.. కచ్చితంగా 2024 ఎన్నికల్లో కుప్పాన్ని కూడా ఎగరేసుకుపోవచ్చని వైకాపా నేతలు భావిస్తున్నారంట. 2019 ఎన్నికల్లో జరిగిన కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటే.. కరోనా ముగిసేవరాకూ బాబు ఎలాగూ కుప్పానికి రాలేరు కాబట్టి… ఈలోపే ఈ నియోజకవర్గంపై తెర వెనుక గ్రిప్ సంపాదించెయ్యొచ్చని ప్లాన్స్ వేస్తున్నారంట. ఈ విషయం ఆ చెవిన ఈ చెవిన పడి ఆఖరికి బాబుగారి చెవి వరకూ చేరిందని అంటున్నారు.

దీంతో.. కుప్పంపై బాబు కాన్సంట్రేషన్ పెరిగిపోయిందంట. అస్తమానం నియోజకవర్గంలోని పెద్ద పెద్ద లీడర్లకు ఫోన్లు చేయడం.. ఎవరు సైకిల్ దిగిపోతున్నారని తెలుస్తున్నా, వారు ఎంత చిన్న నేత అయినా కూడా బాబు నుంచి వారికి ఫోన్ వెళ్లిపోతుందని అంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే… కుప్పం నుంచి వచ్చామని అంటే చాలు.. నేరుగా తనను కలవచ్చు అనే స్థాయిలో బాబు హామీలు ఇస్తున్నారని తెలుస్తోంది.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా… సంక్రాంతి పండక్కి మాత్రమే కొత్తల్లుడు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయే బాబు.. ఇప్పుడేంటి కుప్పంపై ఈ రేంజ్ ప్రేమ కురిపించేస్తున్నారు అనే అనుమానం వచ్చిన వాళ్లు ఆరా తీయగా… ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు! పోనీలే ఈ రకంగా అయినా.. ఎన్నికలు అయిన తర్వాత కూడా బాబు తమవైపు చూస్తున్నారని కుప్పం ప్రజలు ఆనందిస్తున్నారంట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version