వైసీపీ భరతం పట్టడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ చిన్నాభిన్నం కావడంతో బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్..బీజేపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రొత్సహించే రాజకీయ చర్యలు చేపట్టడంపై ఆ పార్టీ రాష్ట్ర నేతలు కొంతమంది అమిత్‌షాకు ఫిర్యాదు చేశారట. దీంతో ఇప్పుడు ఆయన ఇక టీడీపీ విషయం పక్కన పెట్టి వైసీపీ అంతు చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాతోనే ఆటలా అన్నట్లుగా బీజేపీ అధిష్ఠానం ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇక వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రులతో పాటు ప్రధానిమోదీ, గడ్కరీ, అమిత్‌షాలను కలవద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన ఆదేశాలు కూడా బీజేపీ అధిష్ఠానం నోటీస్‌లో ఉందట. రాష్ట్రంలో కొద్దికొద్దిగా పుంజుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ఆ క్రమంలోనే వైసీపీ-బీజేపీ కలసి టీడీపీని దెబ్బకొట్టాయి..ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీకి, వైసీపీకి భారీగా వలసలు పెరిగాయి.. త్వరలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి దూకేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే జరిగితే బీజేపీ మరింత బలపడటం ఖాయం. ఇదిలా ఉండగా జగన్మోహన్‌రెడ్డి గోకరాజు గంగరాజు ఫ్యామిలీ విషయంలో అనుసరిస్తున్న విధానం బీజేపీ అధిష్టానికి కోపం తెప్పిస్తోందంట. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులను, కుమారుడిని వైసీపీ తన వైపు లాక్కొంది. ఒక్క గంగరాజు ఒక్కరే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మొత్తం గోకరాజు ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోందంట.
జగన్‌ను ఇలా వదిలేస్తే రాజకీయంగా మనకే దెబ్బ తగిలేట్లు ఉందని భావిస్తున్న బీజేపీ ఉచ్చు బిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా జగన్ మనకు ప్రత్యర్థి అని రాష్ట్ర నేతలు అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. అయితే జగన్‌పై ఉన్న పలంగా చర్యలకు దిగితే టీడీపీకి లాభం చేకూరితే ఇన్నాళ్లు చేసిందంతా వృథా అవుతుందన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారట.
ఇక వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి తటస్థగా ఉంటున్నట్లు చెప్పినా..వైసీపీతోనే టచ్‌లో ఉన్నారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు కేంద్రమంత్రులను తరుచూ వెళ్లి కలవడంతో వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇక ఆయన బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విందుకు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరైనట్లు సమాచారం.