ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ఒకపక్క ప్రజలలో బలమైన నాయకుడిగా తన పథకాలతో ఆకట్టుకుంటూ మరోపక్క తనకి ప్రత్యర్థి నాయకుడు లేకుండా రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర స్థాయి రాజకీయాల్లో రాజ్యసభ వార్షిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఇటీవల రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తూ సంబంధిత విషయాలను వెల్లడించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
ఈ నేపథ్యంలో వచ్చే నెల 6వ తారీఖున రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, మార్చి 16 నుండి మార్చి 18 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించి, 26వ తారీఖున ఎన్నికలు ఉండబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా వైసీపీ పార్టీ తరపున ఒక స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి కి ఇవ్వటానికి జగన్ ఇష్టపడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. దీంతో చిరంజీవితో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. ఒకవేళ చిరంజీవి వైసీపీ రాజ్యసభ ఎంపీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కచ్చితంగా పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ కి ఇది భారీ దెబ్బ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.