మాటలు లేవ్: శ్రావణ మాసం – విశాఖ ముహూర్తం… లాజిక్ ఇదే!

-

అమరావతిలో ఇన్ సైడ్ డ్రేడింగ్ జరిగిందని.. అభివృద్ది మొత్తం ఒకేచోట కేంద్రీకృతమైతే విభజన సమస్యలు తలెత్తుతాయని.. హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ ఈ రాష్ట్రంలో జరగవద్ద్దని.. అందులో భాగంగా పరిపాలనా వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన జగన్… మూడు రాజధానుల టాపిక్ తెరపైకి తేవడం.. అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం జరిగిపోయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుందని.. అమరావతిలో అవినీతి అక్రమాలు జరగలేదని ప్రతిపక్షాలు వాదించడం మొదలుపెట్టాయి. అయితే రైతులకు అన్యాయం జరగదని ఒక సమస్యను పరిష్కరించ నిర్ణయించిన జగన్… నెక్స్ట్ అమరావతిలో అక్రమాలు జరిగాయని నిరూపించే పనిలో పడ్డారు! అందులో భాగంగా… చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న తుళ్లూరు మాజీ తహసిల్ధార్ ను అరెస్టు చేశారు.. విషయాలు రాబట్టుతున్నారు!

ఇలా రెండు సమస్యలూ దాదాపు తీరే పరిస్థితి రావడంతో… ఇంక మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అంటూ ఆషాడం పూర్తవగానే ఒక మంచిరోజు చూసుకుని విశాఖకు బయలుదేరబోతున్నారట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. “రాజధాని అన్న దానికి సరైన నిర్వచనం ఏదీ లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని” అంటూ గతంలో నిండు సభలో జగన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో… ఇక విశాఖ రాజధాని అయిపోయినట్లే!

ఎందుకంటే… ఒక రాష్ట్రంలో మొదటి వ్యక్తి ఎవరూ అంటే ముఖ్యమంత్రే అని చెబుతారు. కాబట్టి ఆయనే తన కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే.. ఆల్ మోస్ట్ విశాఖ ఫిక్సయిపోయినట్లే భావించాలి! ఈ మధ్య ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడా విశాఖలో రెండు రోజుల పాటు పర్యటించి.. ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖకు తరలివస్తే ఎక్కడ పెట్టాలి.. భద్రతాపరంగా ఏది మేలు అన్న విషయాలు పరిశీలించారని చెబుతున్నారు. “మేము రెడీ.. సీఎం ఎప్పుడంటే ఎప్పుడు” అంటూ సవాంగ్ ప్రకటించారు కూడా!

ఇక్కడ ఉన్నపలంగా రాజధాని, సచివాలయం తరలింపు అంటే అది మామూలు విషయం కాదు! సచివాలయం ఉద్యోగుల్లో ఇప్పటికీ చాలామంది హైదరాబాద్ టు అమరావతి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. విశాఖ అంటే అది అసలు కుదిరే పని కాదు కాబట్టి… కచ్చితంగా కోర్టు కేసులు ఉండే పరిస్థితి ఉంది! వీటన్నిటికీ మధ్యేమార్గంగా ఆలోచించిన జగన్.. తాను కనుక విశాఖ వెళ్ళిపోతే టెక్నికల్ గా అదే రాజధాని అవుతుంది అని భావిస్తున్నారుట! మిగిలిన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మెళ్లగా కుదురుకుంటాయని ఆలోచిస్తున్నారంట! సో… శ్రావణ మాసంలో ఒక మాంచి రోజు చూసుకుని ప్రస్తుతానికి సీఎం విశాఖకు వెళ్లబోతున్నారన్నమాట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version