తాలిబన్ నేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస..!

-

పాక్ ‌కు చెందిన మరో తీవ్రవాద సంస్థ నేత అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తెహ్రిక్‌-ఇ-తాలిబన్ పాకిస్థాన్ నేత ముఫ్తీ నూర్ వాలీ మెహసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. అల్-ఖైదాతో అనుబంధ సంస్థ తరపున ఉగ్రవాదులకు నిధులు, పలు కార్యకలాపాలకు పాల్పడినట్టు పేర్కొంది. ‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ నేత నూర్ వాలీ మెహసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం..

పాకిస్థాన్‌లో అనేక భయంకర ఉగ్రదాడుల వెనుక టీటీపీ హస్తం ఉంది.. నూర్ వలీని ఉగ్రవాదిగా పేర్కొంటూ 2019 సెప్టెంబరులోనే తాము నిషేధించాం’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ట్వీట్ చేశారు. ఇకపోతే గతేడాది లష్కరే తొయిబా చీఫ్ మసూర్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version