ముఖ్యమంత్రిగా అనుభవం లేదు.. వ్యవస్థలపై పట్టు లేదు.. ప్రజల కష్ట సుఖాలపై అవగాహన లేదు..! ఇవన్నీ ముఖ్యమంత్రి అయ్యే ముందు, అయిన తర్వాత కూడా జగన్ పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు! ఈ మాటలు విన్నవారిలో ఒక్కశాతం మంది అయినా కనీసం వీటిని నమ్మి ఉండొచ్చేమో! కానీ జగన్ సీఎం అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ ఒక్కశాతానికి కూడా క్లారిటీ వచ్చేసిందనే అనుకోవాలి!
సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా పని చేయాలంటే కావాల్సింది అనుభవం కాదు.. పరిపాలనపై అవగాహన. వ్యవస్థలపై పట్టు ఉండాలంటే కావాల్సింది అనుభవం కాదు.. చేసేపనిలో చిత్తశుద్ధి కనబరచడం. ప్రజల కష్టసుఖాలు తెలియడం అంటే ఎన్నికల ముందు అవగాహన లేని, అసత్యపు మాటలను వాగ్ధానాలుగా చెప్పడం కాదు… చెప్పే నాలుగు మాటలు, చేసే నాలుగు వాగ్ధానాలు సక్రమంగా ఆలోచించి చేయడం, ప్రజల బాదలు అర్ధం చేసుకుని చేయడం! తన ఏడాది పరిపాలనలో జగన్ చేసింది ఇదే అంటే అతిశయోక్తి కాదు!
బడిపిల్లలు, కాలేజీ విద్యార్థులు, తల్లులు, డ్వాక్రా మహిళలు, రైతులు, ఆటో డ్రైవర్లు, దర్జీలు, క్షురకులు, చేతి వృత్తులవారు, వ్యాపారస్తులు ఇలా ఒక్కరేమిటి? అన్ని వర్గాల ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని.. వారి అవసరాలను గుర్తెరిగి పని చేసుకుంటూ ముందుకువెళ్లారు జగన్! కేవలం సంక్షేమమే కాదు.. వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచనలు చేశారు! దీంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ జగన్ పరిపాలనపై ఒక అవగాహన వచ్చేసింది. జగన్ ఈ తొలి ఏడాదిలో చేసింది ఇదొక్కటే కాదు సుమా… ప్రతిపక్షాల మనుగడను ప్రశ్నార్ధకం చేయడం కూడా!
సమర్ధవంతమైన పాలకుడికి ప్రజాక్షేమం ఎంత ముఖ్యమో, రాజ్యాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నట్లుగా సాగించిన ఈ ఏడాది పాలనలో… ప్రతిపక్షాలను ఏమాత్రం తేరుకోకుండా చేశారు జగన్! ఎన్నికల సందర్భంలో ప్రజలు కొట్టిన దెబ్బ నుంచి టీడీపీ – జనసేనలు తేరుకునే అవకాశం అసెంబ్లీ బయటా, లోపలా కూడా జగన్ కల్పించలేదు! తమ పరిపాలనలో మంచిని ఎంత బలంగా ప్రమోట్ చేసుకున్నారో.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఉదహరిస్తూ, ఎండగడుతూ అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు! ఫలితంగా ఎన్నికల దెబ్బ నుంచి కోలుకునే పరిస్థితి లేకుండా చేశారు!
ఇలా జగన్ వన్ ఇయర్ పాలనలో ప్రజలకు ఎంత మేలు చేశారో అదేస్థాయిలో ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు! ఏ ఒక్క విషయంలోనూ ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం లేకుండా పరిపాలించడం అంటే చిన్న విషయం కాదు కదా! నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే పనికి టీడీపీ ఎలాగూ పూనుకోకపోయినా… వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేసే స్థాయికి పడిపోయారంటేనే జగన్ వారిని ఏస్థాయిలో అణగగొట్టేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు!! ఏది ఏమైనా.. జగన్ వన్ ఇయర్ పాలన ప్రజలకు స్వీట్ డ్రీం అయితే.. ప్రతిపక్షాలకు బ్యాడ్ డ్రీం!