జ‌గ‌న్ దెబ్బకు బెంబేలెత్తున్న కేంద్రం…!

-

ఏపీ సీఎం వేసిన దెబ్బ‌కు ఇప్పుడు కేంద్రం బెంబేలెత్తుతుంది.. కేంద్ర‌మే కాదు.. ఏకంగా అంత‌ర్జాతీయ స్థాయిలోనే వ‌ణుకు మొద‌లైంది.. ఇదేంటీ.. ప‌రిపాల‌న అనుభవం లేని జ‌గ‌న్ కొట్టిన దెబ్బ‌కు దేశం, విదేశం అని తేడా లేకుండా ఎందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్లు.. అసలు అంతలా భ‌య‌పెట్టే ప‌నేం చేశారు సీఎం జ‌గ‌న్ అనుకుంటున్నారా… అస‌లు రాజ‌కీ ప‌రిణితే లేద‌న్న జ‌గ‌న్‌ను, చిన్న‌వ‌య‌స్సులోనే సీఎంగా పీఠ‌మెక్కిన జ‌గ‌న్ ఏం ప‌రిపాల‌న చేస్తార‌న్న అనుమాల‌ను బ‌ద్ద‌లు కొడుతూ వ‌య‌స్సులో చిన్న‌వాడినైనా దెబ్బ కొట్ట‌డంలో గ‌ట్టివాడినే అని నిరూపించారు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.

సీఎం జ‌గ‌న్ చేసిన ఈ చిన్న పనితో గ‌ట్టి దెబ్బ కొట్టారు. అంతే కాదు ఈ దెబ్బ‌తో కేంద్రం దిమ్మ తిరిగింది.. ఈ దెబ్బ కేంద్రంలోని పెద్ద‌ల‌కు త‌గిలింది. వీరితో పాటుగా అంత‌ర్జాతీయ స్థాయిలోనే కేంద్రానికి ఎదురుదెబ్బ త‌గిలే స్థాయికి వెళ్లింది. అంటే జ‌గ‌న్ కొట్టిన దెబ్బకు అంత‌ర్జాతీయ స్థాయిలోనే త‌గిలిందంటే.. ఇది చాలా పెద్ద‌దే అయి ఉంటుంద‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతుంది. అస‌లు సీఎం జ‌గ‌న్ అంత‌లా ఏమీ చేశారు.. ఆయ‌న చేసిన ప‌ని తో అంత‌లా కేంద్రం భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఎందుకొచ్చింది. అస‌లు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఇప్పుడు కేంద్ర‌మే రంగంలోకి దిగి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకుందంటే జ‌గ‌న్ కొట్టిన దెబ్బ బాగానే త‌గిలిందన్న‌మాట‌..

ఇంత‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఏంటో ఓసారి చూస్తే కేంద్రం, అంత‌ర్జాతీయ స‌మాజంలో కొంద‌రు పెద్ద‌లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. ఏపీ మాజీ సీఎం చంద్రాలు చేసిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు కేంద్రం మెడ‌కు చుట్టుకుంది. అందుకే కేంద్రం కిమ్మ‌న‌కుండా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని దేశ‌వ్యాప్తంగా స‌మీక్షించేందుకు సిద్ద‌మైంది.. ఏపీ సీఎంగా చంద్రాలు ఉన్న‌ప్పుడు ఒప్పందం చేసుకున్న విద్యుత్ పీపీఏల‌పై స‌మీక్షించాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ పీపీఏల స‌మీక్ష చేస్తే అంత‌ర్జాతీయంగా కేంద్రానికి పెద్ద దెబ్బ‌గా మారింది. పీపీఏలు ముందుగా కుదుర్చుకున్న‌వి.. అయితే అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ స‌ర్కారు పీపీఏల ఒప్పందం జ‌రుగుతుంది.

అయితే అధికారం చేతులు మార‌గానే పీపీఏల‌పై స‌మీక్ష చేస్తే ఇది రాజ‌కీయ క‌క్ష‌ల‌కు దారితీసి, విద్యుత్ పెట్టుబ‌డుల‌పైన‌, విద్యుత్ ఉత్ప‌త్తిపైనా తీవ్ర‌ప్ర‌భావం చూపన్న‌ది. అందుకే జ‌గ‌న్ తీసుకున్న పీపీఏల సమీక్ష ఇప్పుడు పెద్ద ఎత్తున్న అంత‌ర్జాతీయ‌, జాతీయ స్థాయిలో దుమార‌న్నే రేపుతుంది. అందుకే జ‌గ‌న్ తీసుకున్న పీపీఏల స‌మీక్ష‌తో విద్యుత్ రంగంలో పెను సంచ‌ల‌నాలే క‌లుగ‌నున్నాయి. అంటే కేంద్రం కూడా పీపీఏల సమీక్ష‌పై జంకుతున్న‌ది. అంటే పీపీఏల పేరుతో జ‌రిగే దోపిడిని అరిక‌ట్ట‌లేనంత స్థాయిలోనే జ‌రుగుతుంద‌ని, ఇది అంత‌ర్జాతీయ స్థాయిలో పెద్ద మాఫీయాగానే త‌యారైన‌ట్లే. అందుకే జ‌గ‌న్ చాలా తెలివిగా చంద్రాలును కెలికితే.. అది కాస్త కేంద్రానికి చుట్టుకుంది.. అంటే జ‌గ‌న్ తేనేతుట్టేను క‌దిపాడ‌న్న‌మాట‌.

చంద్రాలును దోషిగా నిలుపాల‌ని, ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలువాల‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నం కాస్త అది కేంద్రం మెడ‌కు చుట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అంటే ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణ‌యం కేంద్రం కూడా బ‌య‌ప‌డే స్థాయికి తీసుకొచ్చార‌న్న మాట‌. అందుకే కేంద్రం జ‌గ‌న్ వేసిన దెబ్బ‌కు బెంబేలెత్తిపోయి ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పీపీఏల‌పై ఎలాంటి సమీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా చేసేందుకు ఈ నెల 11, 12తేదీల్లో గుజరాత్‌లో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల విద్యుత్తు శాఖా మంత్రుల సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా విద్యుత్ పీపీఏల‌పై చర్చించ‌నున్నార‌నే ఎజెండాను పంపింది కేంద్ర ప్ర‌భుత్వం. అంటే జ‌గ‌న్ దెబ్బ‌కు కేంద్రంలో వ‌ణుకు షురూ అయి ఇప్పుడు ఏకంగా అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్న‌మాట‌..

Read more RELATED
Recommended to you

Exit mobile version