కేంద్రంపై పోరాటంలో జగన్ కు మరో విజయం..!

-

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి వెళ్లే అలవాటు పెద్దగా లేదు. అవతల ఉన్నది ఎవరైనా లెక్కచేయని మొండితనం ఆయన సొంతం. ఇప్పుడు ఏపీ సీఎం అయ్యాక పీపీఏ ల విషయంలో జగన్ ఇదే వైఖరి అవలంభిస్తున్నారు. కేంద్రం వద్దు మొర్రో అంటున్నా విపక్షాలు విమర్శలు చేస్తున్నా జగన్ తగ్గడం లేదు.

ఇప్పుడు జగన్ నిర్ణయానికి సానుకూలంగా హైకోర్టు కూడా కామెంట్స్ చేసింది. పీపీఏల విషయంలో కేంద్రం మొండి పట్టుదలకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అటు కేంద్ర విద్యుత్ శాఖ తెగ కంగారు పడుతున్నాయి.

తాజాగా మరోసారి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి లేఖలతో మరోసారి తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ముందస్తు చెల్లింపులకోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి తీరాలని పట్టుబడుతూ రాష్ట్రానికి లేఖ రాసింది. లేకుంటే బహిరంగ మార్కెట్ లో కొనుగోళ్లను నిలువరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

దీనిపై ఆంధ్రప్రదేశ్ ఏస్సీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హైకోర్టును ఆశ్రయించారు. బకాయిల చెల్లింపుల విషయంలో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44, పవన విద్యుత్ రూ.2.43 చొప్పున చెల్లింపులకు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులిచ్చిన ఈ విషయాన్ని కోర్టు ముందుంచారు.
రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, వీలును బట్టి బకాయిలు చెల్లిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తూ, విద్యుత్ కొనుగోళ్లను అడ్డుకోవద్దని కేంద్రానికి ఉత్తర్వులిచ్చింది. ఇది జగన్ కు నైతిక విజయమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version