ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ను ఫాలో అవుతున్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లానీరు ఇస్తున్నారు. ఈ పథకానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో నూటికి 90 శాతం వరకూ ప్రజలకు తాగునీటి కష్టాలు తొలిగాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో తెలంగాణ బాట పడుతోంది.
ఏపీలోని 13 జిల్లాల్లో అందరికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్ గ్రీడ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి కూడా మనిషికి 105, 110 లీటర్లు ప్రతి రోజు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఏపీ డ్రికింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌కు నిధులు సమకూర్చుకునేందుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది.
సుమారుగా రూ.4.90 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అంటే.. తెలంగాణలోని ప్రతి జనావాసానికి మంచినీరు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ లాంటి పథకం ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలుకాబోతోందన్నమాట. అంటే కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారుగా.