R R R  లో దిమ్మ‌తిరిగి పోయే ట్విస్ట్ అదేనా..

-

రెండు భిన్న ప్రాంతాలకు, భిన్న కాలాలకు చెందిన ఇద్దరు వీరుల కథకు ఫిక్షన్ జోడించి ద‌ర్శ‌కధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు అన్నీ ఇన్నీ కావు. రు. 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ యూర‌ప్‌లోని బ‌ల్గేరియాలో జ‌రుగుతోంది.

ఇక ఈ సినిమాను వ‌చ్చే యేడాది జూలై 30న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. అయితే సినిమా షెడ్యూల్స్ కంటిన్యూగా లేట్ అవుతూ వ‌స్తున్నాయి. తెలుగు గ‌డ్డ‌పై పుట్టిన ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో ఎన్టీఆర్, చరణ్ లు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే ఈ ఇద్ద‌రు యోధులు వేర్వేరు కాలానికి, వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన వారు.

నైజాంలో న‌వాబుల‌ను ఎదిరించి పోరాడిన వీరుడు కొమ‌రం భీం, విశాఖ మ‌న్యంలో బ్రిటీష్ వారి అరాచ‌కాల‌పై సీతారామ‌రాజు పోరాడారు. ఇక వాస్త‌వంగా ఉన్న రెండు పాత్ర‌ల ఆధారంగా తెర‌కెక్కే క‌ల్పిత గాధ అని ఈ సినిమా క‌థ‌పై ఇప్ప‌టికే రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమా తీయడానికి ప్రేరణ ఇచ్చిన చిత్రం మోటర్ సైకిల్ డైరీస్ అని చెప్పారు.

అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంటుందా ? అన్న సందేహం వ‌స్తుంది. ఆ ట్విస్ట్ ఏంటో కాదు… చరణ్, ఎన్టీఆర్ పాత్రలు రెండు గా కనిపించే ఒక పాత్ర. మ‌రి ఇదే నిజం అయితే ప్రేక్ష‌కులకు మ‌తిపోవ‌డం ఖాయం. మ‌రి రాజ‌మౌళి ఏం చేస్తాడో ?  ఆర్ ఆర్ ఆర్‌ను ఊహ‌ల‌కు అంద‌కుండా ఎంత గొప్ప‌గా ప్రజెంట్ చేస్తాడో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version