బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్.. నిరాహార దీక్ష భగ్నం

-

నిన్న మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఇవాళ వైయస్సార్ టిపి పార్టీ అధినేత వైయస్ షర్మిల పరామర్శించారు. నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు రవి రవికుమార్ కుటుంభానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించే వరకు కదిలేది లేదని నిరాహార దీక్షకు కూర్చున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు..వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేశారు. దాదాపు మూడున్నర గంటలపాటు వైయస్ షర్మిల దీక్ష కొనసాగింది.

బాధిత కుటుంబానికి పరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగింది వైయస్ షర్మిల. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అరెస్టు చేశారు. ఇక అంతకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ…రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారని.. రైతు గుండె ఆగిపోయేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్ర‌హించారు. వరి వద్దన్నా సీఎం మనకు వద్దని… తెలంగాణ రాష్ట్రంలో వరి వేయొద్దు అనే హక్కు సీఎం కేసీఆర్ కు లేదని వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version