టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఏంటని.. షర్మిల లాంటి వాళ్ళు బీజేపీ ఏజెంట్లు అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చింది. అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటని కేటీఆర్ అంటున్నాడని, నాకు మా ఆన్న మీద కోపం ఉంటే ఇక్కడ లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది కదా అని ఆమె మండిపడ్డారు.
ఆ మాట లో నిజం లేదు కాబట్టే…అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీతో మాకు పొత్తు ఉందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, బీజేపీ తో డ్యూయెట్లు పాడింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. మీరు తెరవెనుక పొత్తు పెట్టుకొని మమ్మల్ని అంటారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఎవరితో పొత్తులు లేవని, మేము ఎవరికి ఏజెంట్లు కాము అని ఆమె వెల్లడించారు. టీఆర్ఎస్ ఓట్లను చిలుస్తాం.. బీజేపీ,కాంగ్రెస్ ఓట్ల ను సైతం చీలుస్తామని ప్రకటించారు.