తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని కాస్త చీల్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు కొంత మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ లో సోనియా గాంధీ అభిమానులు కొంతమంది ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని… ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొంత మంది పరోక్షంగా సహాయసహకారాలు అందించారు అని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొంతమందిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదరించడం లేదు అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అలా ఆదరణలేని కొంతమందిని తనవైపుకు తిప్పుకునే ఆలోచనలో వైయస్ షర్మిల ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంతమందితో ఆమె భేటీ కావడానికి కూడా సిద్ధం అవుతున్నారు. త్వరలోనే కొంత మందిని కలిసి తన పార్టీలో ప్రాధాన్యత ఇస్తానని తన తండ్రి హయాంలో ఎంత నిజాయితీగా పని చేశారో… తన వద్ద కూడా అంతే నిజాయితీగా పనిచేస్తే కచ్చితంగా పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పారట.
రేపు ప్రభుత్వంలో కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తాను అని ఆమె చెప్పడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. కాబట్టి ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను దూరం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.