కేసీఆర్‌ గుడ్లు పీకేయాల్సిందే…నిర్మల్‌ రేప్‌ కేసుపై షర్మిల ఫైర్‌..!

-

నిర్మల్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ షాజిద్‌.. ఓ బాలిక లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తోంది. అయితే.. ఈ సంఘటనపై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంది పెద్ద దొరా మీ నాయకుల బాగోతం అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు. “ఆడ పిల్లల వంక చూస్తే గుడ్లు పీకేస్తాం, లంచాలు అడిగితే గల్లాపట్టి కొట్టండి. అని చెప్పిన పెద్ద దొర, చిన్న దొరా, చూడండి మీ నాయకుల బాగోతం.” అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

లంచంగా అమ్మాయిల మానాన్ని అడుతున్నారని.. ఇండ్లు ఇప్పిస్తామని అమాయక అమ్మాయిలను లోబర్చుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కంచే చేను మేసిందన్నట్లు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలే గద్దల్లా అమ్మాయిల మాన ప్రాణాలు పీక్కతింటుంటే ఇంకెక్కడిది మహిళలకు రక్షణ? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మీ నాయకుల తప్పులు మీ కండ్లకు కనపడవా అని నిలదీశారు. మీ చట్టానికి దొరకవు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరుగకూడదంటే, గుడ్లు పీకాల్సింది మీవా? మీ నాయకులవా? మీరే తేల్చుకోండి అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version