మల్లాపూర్ మండలం గొర్రేపల్లి గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో సోమవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఆ ఇంట్లో నవీన్ అనే వ్యక్తి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది