జగన్ జైల్లో ఉన్న టైంలో వైఎస్ విజయమ్మ పార్టీని బలంగా నడిపించారు. ఆ తర్వాత జగన్ జైలు నుండి బయటకు రావడం 2014 ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పై పోరాడుతూ రాజకీయాలు చేసిన జగన్ సరిగ్గా 2019 ఎన్నికల టైంలో తల్లి వైయస్ విజయమ్మ ని ఎన్నికల ప్రచారంలో దింపారు. ఆ టైంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అనేక చోట్ల పార్టీ తరఫున ప్రచారం చేయటం జరిగింది.
పూర్తి మేటర్ లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో ఆనం సోదరుల రాకకు ముందుగానే ఆనం విజయ్‌కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కుమారుడు కూడా వైఎస్ విజయమ్మకు అనుచరుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు అనుకూలంగా ఉన్న ఆనంకు ఫేవర్ చేయాలని భావించిన విజయమ్మ ఆనం అరుణ విషయంలో ఎన్నికలకు ముందుగానే తన సిఫారసు పంపారు. ఏంటో తన తల్లి సిఫార్సు తోనే ఆనం అరుణకు జడ్పీ చైర్మన్ పదవిని వైయస్ జగన్ ఇచ్చినట్లు పార్టీలో టాక్.