నీకేమైనా పిచ్చెక్కిందా .. సమంతకి వార్నింగ్ ఇచ్చిన భర్త నాగ చైతన్య …!

-

సాధ్యమైనంత వరకు ఏ హీరోయిన్ కూడా సినిమాలతో బిజీగా ఉండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే పొరపాటున పెళ్ళి అన్న మాట వినడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. కెరీర్ లో ఇంకా మంచి పాత్రలు చేయాలి ..ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంటూ అసలు పెళ్ళి ఊసే ఎత్తరు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి సినిమాలలో హీరోయిన్స్ గా అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ కి పెళ్ళి అయిందంటే మేకర్స్ దూరం పెట్టేస్తారు. కానీ సమంత మాత్రం కెరీర్ మాంచి ఊపులో ఉన్నప్పుడే అక్కినేని హీరో నాగ చైతన్యని పెళ్ళి చేసుకుంది. దాంతో అందరు ఇక సమంత సినిమాలు చేయదని ఫిక్సైపోయారు.

 

కాని అందరికీ షాకిచ్చి మజిలీ, ఓ బేబి, జాను వంటి మంచి సినిమాలు చేయడంతో పాటు మంచి పాత్రలు చేస్తుందని అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. సమంత ప్రస్తుతం చేస్తున్న ప్రతి సినిమా తనలోని నటిని పూర్తి స్థాయిలో కనబర్చేవిగా ఉంటున్నాయి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం మజిలీ, జాను వంటి కాన్సెప్ట్ బేస్డ్.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ తన స్టార్ డం ని పెంచుకుంటోంది.

అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుందట సమంత. అదే విషయాన్ని భర్త నాగ చైతన్యతో చెబితే వార్నింగ్ ఇచ్చాడట. నీకేమైనా పిచెక్కిందా. నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా ..! అంటూ ఆశ్చర్యంగా అడిగాడట. పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి కారణం చైతూ అని ..పెళ్లి తర్వాత ఎవరైనా బ్రేక్ తీసుకుంటే వారు మళ్లీ హీరోయిన్ గా కొనసాగిన సందర్భాలు లేవని అన్నాడట. అందుకే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ గా సినిమాలు చేయడానికి చైతు నే సపోర్ట్ అంటూ సమంత తెలిపింది. ఇక మరోసారి నాగ చైతన్య, సమంత కలిసి మజిలీ వంటి ఎమోషనల్ డ్రామాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి అలాంటి కథ ఏ దర్శకుడు చెప్పి ఒప్పిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version