వివేకా హత్య కేసులో నేను విచారణకు హాజరు కాలేనని… కడప ఎంపి అవినాష్ రెడ్డి తేల్చి చెప్పారు. వివేకా హత్య కేసులో నేడు హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కాని కడప ఎంపి అవినాష్ రెడ్డి…పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని తెలిపారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు సిబిఐ.
ఈ రోజు వేంపల్లి మండలంలో గృహసారధుల కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపి అవినాష్ రెడ్డి.. ఈ రోజు కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహంలో సిబిఐ విచారణకు ఎంపి తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12 న విచారణకు హాజరు కావాలని భాస్కరరెడ్డికి మొదట తెలిపింది సిబిఐ. ఆ తరువాత 6 వ తేదీన తప్పకుండా హాజరు కావాలని తిరిగి మరో నోటీస్ ఇచ్చింది సీబీఐ. ఈ రోజు విచారణకు వస్తారా లేక 12 నే హాజరవుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.