ఏపీ రైతులకు శుభవార్త..8.22 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు

-

ఏపీ రైతులకు శుభవార్త. వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి 2021 ఖరీఫ్ సీజన్ లోని అర్హుల జాబితా లెక్కతేలింది. ఈ సీజన్ కు సంబంధించి 10.76 లక్షల మంది రూ. లక్ష లోపు రుణాలు పొందినట్లు గుర్తించగా, వారిలో నిర్నిత గడువులోగా చెల్లించడం, ఈ-క్రాప్ ప్రామాణికంగా పంటలు సాగు చేసిన 5.68 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరికి రూ.115.33 కోట్లు జమ చేయనున్నారు.

అలాగే రబీ 2020-21 సీజన్ లో 2.54 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ. 45.22 కోట్లు జమచేయనున్నారు. ఈ జాబితాలను జిల్లాల వారీగా అర్బికెల్లో ఈనెల 19-22 వరకు ప్రదర్శిస్తుండగా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీలో భాగంగా బుధవారం నుంచి 25 వరకు ప్రదర్శిస్తారు. రెండు సీజన్ల కు సంబంధించి 8.22 లక్షల మంది ఖాతాలకు రూ. 160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఈ నెల 28న సీఎం జగన్ జమ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version