చేజేతులారా తన అందాన్ని పాడు చేసుకుంటున్న రకుల్..!!

-

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ అభిమానులను మాత్రం భారీగానే సంపాదించుకుంది. ఎక్కువగా ఇప్పుడు బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది రకుల్.

ఈ ముద్దుగుమ్మ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా జిమ్ములో వర్క్అవుట్ చేస్తూ తన ఫిట్నెస్ ని , అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రకుల్ కెరియర్ మొదట్లో చాలా అందంగా కనిపించినా ప్రస్తుతం ఉన్న అందాన్ని చూస్తే అభిమానులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోతోందని చెప్పవచ్చు.

కేవలం రకులే కాకుండా ఎంతోమంది హీరోయిన్ల సైతం మొదట్లో వచ్చినట్లుగా ఇప్పుడు లేరని చెప్పవచ్చు అందులో నయనతార, కాజల్, సమంత ఇలా ఎంతో మంది హీరోయిన్లు కూడా చాలా మారిపోయారు. వీరి తరువాత రకుల్ ప్రీతిసింగ్ కూడా అలానే మారిపోయింది. రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం ఉన్న రూపాన్ని చూస్తే అందరూ షాక్ అవ్వకుండా ఉండలేరు.

ఇక ఈమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కన్నడ వంటి చిత్రాలలో కూడా నటించింది. తన గ్లామర్ తో సోషల్ మీడియాలో కుర్రకారుకు సైతం గుండెల్లో గుబులు రేపేలా చేస్తూ ఉంటుంది. ఈమధ్య సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుంది. రకుల్ షేర్ చేసిన కొన్ని ఫోటో షూట్ ల ద్వారా కూడా ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది. కెరియర్ మొదట్లో చాలా బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా సన్నగా నాజుగ్గా మారిపోయి మరింత వర్క్ అవుట్ లు చేసి చాలా సన్నబడిందని చెప్పవచ్చు.

తాజాగా రకుల్ కి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలపై అభిమానుల సైతం రకుల్ ఫేస్ చూస్తే మాత్రం అక్కడ ఉన్నది రకులేనా అనుమానం ఉన్నదని కామెంట్లు చేస్తున్నారు. ఇక దీంతో రకుల్ ఫ్యాన్స్, నేటిజన్ లు సైతం ఏంటి రకుల్ ఇంత ఘోరంగా మారింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా సన్నబడి జిమ్లో వర్కౌంట్లో చేసి చేతులారా తన అందాన్ని పాడు చేసుకుంటుందని అభిమానుల సైతం భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version