పవన్-పాల్..ఎగతాళితో రిస్క్ వైసీపీకే..!

-

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే..విశాఖలో తనని అడ్డుకున్న దగ్గర నుంచి ఏ మాత్రం తగ్గకుండా తెగించి మరీ రాజకీయం చేస్తున్నారు. ఇంతకాలం ఓర్పుతోనే రాజకీయం చేస్తూ వచ్చారు..కానీ వైసీపీ నేతలు పదే పదే పవన్‌ని వ్యక్తిగతం టార్గెట్ చేసి బూతులు తిట్టడంతో పవన్ కూడా రివర్స్ అయ్యారు..వారికి అదే బాషలో కౌంటర్లు కూడా ఇచ్చారు. అలాగే చంద్రబాబు కలిశాక పవన్ మరింత దూకుడుగా వెళుతున్నారు.

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై వైసీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చారు…వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక కేసులు పెట్టుకున్న పర్లేదు..అరెస్ట్ అయిన పర్లేదు అనే విధంగా పవన్ తెగించేసి రాజకీయం చేస్తున్నారు. పవన్ దెబ్బకు పోలీసులు కూడా ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పటివరకు ప్రతిపక్ష నేతలని, కార్యకర్తలని కేసులు పెట్టో, జైల్లో పెట్టో కాస్త నిలువరించారు. కానీ అటు టీడీపీ గాని, ఇటు జనసేన శ్రేణులు గాని ఇంకా తెగించేశారు. అరెస్ట్ అయిన పర్లేదు అని అనుకుంటున్నారు.

రానున్న రోజుల్లో పవన్ మరింత దూకుడుగా వైసీపీపై పోరాడేలా ఉన్నారు..అయితే పవన్‌ని నిలువరించడానికి ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని లాంటి వారు దారుణంగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. రెండుచోట్ల ఓడిపోయారని పదే పదే మాట్లాడుతున్నారు. అలాగే కే‌ఏ పాల్, పవన్ ఒక్కటే అని సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణలో పాల్..ఆంధ్రాలో పవన్ అంటున్నారు.

అయితే పవన్‌ని ఎగతాళి చేస్తూ, తక్కువ అంచనా వేస్తే వైసీపీకే రిస్క్ తప్పదు. ఆయనకు గెలిచే సత్తా ఇప్పుడు లేకపోవచ్చు..కానీ వైసీపీని ఓడించే సత్తా మాత్రం ఉందని గట్టిగా చెప్పొచ్చు. టీడీపీతో కలిస్తే వైసీపీకి ఇంకా రిస్క్ పెరుగుతుంది. ఆయన్ని ఎంత ఎగతాళి చేస్తే..ప్రజల్లో అంత అభిమానం పెరిగేలా ఉంది. పరోక్షంగా వైసీపీ నేతలు తిట్టి పవన్‌ బలం ఇంకా పెంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version