ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మిల మరణించిన నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులంతా కృష్ణను పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బాల కృష్ణ, సూపర్ స్టార్ ఇంటికెళ్లి పరామర్శించారు. అయితే ఇప్పుడదే జగన్ అభిమానుల ఆగ్రహానికి దారి తీసింది. జగన్ పరామర్శకు వెళ్లినప్పుడు ఆ దరిదాపుల్లో ఎక్కడా కృష్ణ తనయుడు, హీరో మహేష్ బాబు కనిపించలేదు. కానీ చంద్రబాబు పరామర్శకు వెళ్లినప్పుడు మాత్రం స్వయంగా దగ్గరుండి మహేష్ బాబు వెలక్ కమ్ చెప్పి మరీ కష్టసుఖాలు మాట్లాడాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవి చూసిన జగన్ అభిమానుల కోపం ఒక్కసారిగా కట్టులు తెచ్చుకుంది. జగన్ వచ్చిన ప్పుడు మహేష్ బాబు ఏయమయ్యాడంటూ ఆయన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సిఎం వస్తున్నాడన్న విషయం తెలిసి కూడా మహేష్ బాబు కనిపించకపోవడం ఏ మాత్రం బాగో లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది జగన్ ని అవమానించినట్లేనని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కంటే వైఎస్ ఫ్యామిలీనే ఘట్టమనేని కుటుంబానికి దగ్గర అంటూ ఎత్తి చూపుతున్నారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్ననప్పుడు వివాదం లో ఉన్న పద్మాలయ స్టూడియో భూమిని క్రమబద్దీకరించారని, మహేష్ నటించిన సైనికుడు సినిమా విడుదలైనప్పుడు వరంగల్ లో జరిగిన గొడవలో కూడా మహేష్ ను వైఎస్ క్షమించి వదిలేసారని పాత విషయాలను గుర్తు చేసి దెప్పిపొడుస్తున్నారు.
ఇక ఎన్నికలకు ముందు మహేష్ బాబాయ్ ఆది శేషగిరిరావు వైకాపీలోనే ఉన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇక కృష్ణ అయితే మొదటి నుంచి వైసీపీ వెంటే ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎన్నికలకు ముందు ధీమా వ్యక్తం చేసిన మొదటి టాలీవుడ్ సెలబ్రిటీ అయనే. ఇక జగన్ కూడా మహేష్ కు మంచి స్నేహితుడే. కానీ జగన్ వచ్చిన సమయంలోనే మహేష్ లేకపోవడంతో ఇంత రచ్చకు దారి తీసిందని తెలుస్తోంది. మరి దీనిపై మహేష్ సమాధానం ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం మహేష్ సరిలేర నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు.