రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు: కడియం శ్రీహరి

-

గత కొన్ని రోజులుగా మీడియాలో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి టీఆర్ఎస్ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారని.. అందుకే.. త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ పలు మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి.

రాజకీయ స్వార్థం కోస పార్టీలు మారాల్సిన అవసరం కానీ… పదవుల కోస పాకులాడాల్సిన పరిస్థితి కానీ నాకు లేదు. అవినీతి, అక్రమాలను పెంచి పోషించి.. విలువలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకే నేను నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేయలేదు.. అంటూ కడియం శ్రీహరి బహిరంగ లేఖను విడుదల చేశారు.

గత కొన్ని రోజులుగా మీడియాలో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి టీఆర్ఎస్ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారని.. అందుకే.. త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ పలు మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. ఆ వార్తలపై కడియం శ్రీహరి స్పందించారు. మీడియాకు బహిరంగ లేఖ రాశారు.

కావాలని తనపై కుట్ర చేస్తున్నారని… రాజకీయాల్లో నిజాయితీ, సమర్ధత, విలువలే పెట్టుబడిగా తాను కొనసాగుతున్నానని.. తనలాంటి రాజకీయ నేపథ్య ఉన్న వ్యక్తిని ప్రోత్సహించాలి.. అండగా ఉండాలి.. కానీ.. ఇలా లేనిపోని అసత్య ప్రచారం చేయకూడదంటూ కడియం మీడియాపై ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లో అనేక అద్భుత సందర్భాలను, క్లిష్ట కాలాలను, ఒడిదుడుకులను చూసిన వాడిని. ఎదుగుతున్న దళిత నాయకత్వాన్ని బలహీనపరచి.. బదనాం చేసే కుట్రలో భాగంగా కొన్ని స్వార్థపర శక్తులు తన వ్యక్తిత్వాన్ని, అవకాశాలను దెబ్బ తీసేవిధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని కడియం శ్రీహరి అన్నారు.

నేను అంబేద్కర్ వాదిని. వామపక్ష భావజాలంతో పెరిగిన వ్యక్తిని. కులం, మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు నేను దూరంగా ఉంటాను. దళిత, ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకమైన, సిద్ధాంతపరంగా విభేదించే బీజేపీలోకి వెళ్లే దుస్థితి నాకు పట్టలేదు.. అంటూ కడియం శ్రీహరి ఒకింత అసహనానికి గురయ్యారు.
దేశం మొత్తం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తోంది.

యావత్తు తెలంగాణ ప్రజానీకం సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మద్దతు తెలుపుతున్నారు. దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భారత్ లోనే అగ్రగామిగా నిలవబోతోంది. కేసీఆర్ నాయకత్వంలోనే నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో నావంతు బాధ్యత నిర్వర్తిస్తా… అని కడియం లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version