అక్రమాల ”ప్రజా వేధికకు” సంవత్సరీకాలు..! సాయిరెడ్డి కౌంటర్లు..!

-

ysrcp mp vijayasaireddy slams tdp leaders over their comments on prajavedhika building
ysrcp mp vijayasaireddy slams tdp leaders on prajavedhika building issue

గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలొకి రాగానే చంద్రబాబు నిర్మించిన ప్రజా వేధికను కూల్చి వేశారు. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వ తీరు పై ప్రభుత్వ విదానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపద్యం లో వారి వ్యాఖ్యలకు పదును జవాబు ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ వేధికగా టీడీపీ నేతలపై టీడీపీ హయాం లోని ప్రభుత్వం పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఆయన మాట్లాడుతూ..  ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాబట్టే ప్రభుత్వం కూల్చేసింది. అదేదో మీ సొంత ఇల్లును నేలమట్టం చేసినట్టు సంవత్సరీకాలు జరపుకోవడం ఏమిటి ఉమా అంటూ దేవినేని ఉమాకు కౌంటర్ వేశారు. టీడీపీ ప్రభుత్వ అవినీతికి ప్రజావేధిక భవనం చిహ్నం అని ఆయన అన్నారు ప్రజా వేధికను రేకుల షెడ్డుతో పోల్చారు. అవినీతికి చిహ్నం అయిన ఆ భవనం కూల్చిన తేదీ గుర్తుపెట్టుకుని శోకాలు పెడుతున్నారు ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఏదైనా సేవ చేయండయ్యా అంతా హర్షిస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version