వైజాగ్ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత !

-

వైజాగ్ క్రికెట్ స్టేడియం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడంతో ఆందోళనకు దిగింది వైసీపీ. ఇందులో భాగంగానే…వైజాగ్ మధురవాడలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసనలు చేస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు. తొలగించిన వైఎస్సార్ పేరును వెంటనే ఏర్పాటు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అంటున్నారు వైసీపీ పార్టీ నేతలు.

YSRCP protests removal of YS Rajasekhara Reddy’s name from Vizag Cricket Stadium

ఇక ఈ నెల 24,30వ తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక జాగ్ మధురవాడలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసనలు చేస్తున్న వారిలో గుడివాడ అమర్‌ నాథ్‌ కూడా ఉన్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version