ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా దేశాలలో ప్రధానులు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. భారతదేశంలో కూడా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించారు. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు ప్రజలను చైతన్య పరుస్తూ అవసరాలను తీరుస్తూ లాక్ డౌన్ పక్కాగా అమలు అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు.
మరో వైపు హైదరాబాద్ లో ఉంటున్న వారిని ఉసిగొల్పే కుట్రలకు తెరలేపారు”అని అన్నారు . మరొక ట్వీట్ లో “దూరదృష్టి, ప్రజల పట్ల బాధ్యత, ఎటువంటి పరిస్థితులనైనా అదుపు చేయగల నాయకుడే ఇవ్వాల్టి అవసరం. దేశమంతా భీతిల్లుతున్నా సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసి కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించడం అసాధారణం. దేశమంతా ఆయన మార్గాన్ని అనుసరిస్తుంది” అని అన్నారు. ఏదో మామూలు టైములో మీడియా ముందు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని సమయం సందర్భం లేని టైంలో కాదు ఇటువంటి టైం లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నట్టుగా చంద్రబాబుకి ట్విట్టర్ ద్వారా గట్టి స్ట్రోక్ విజయసాయిరెడ్డి ఇచ్చారు.