పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న యువరాజ్ సింగ్ ?

-

యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఆల్ రౌండర్ గా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో 2011 ప్రపంచ కప్ ను ఇండియా కు అందించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని లీగుల్లో మాత్రమే కనిపిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదిలా ఉంటే…. త్వరలోనే టీమిండియా యువరాజ్ కొత్త అవతారంలో కనిపిస్తాడన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది.

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్లోని గురుదాస్పూర్ లేదా చండీగఢ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని యువీ కలిసినప్పటి నుంచి అతడి రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యువీ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news