తిరుమల : టిటిడి 52వ పాలకమండలి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించారు వైవి సుబ్బారెడ్డి. గరుడాళ్వార్ సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు ఇఓ జవహార్ రెడ్డి. భాధ్యతలు స్వీకరణ అనంతరం రంగనాయకుల మండపంలో వైవి సుబ్బారెడ్డిని ఆశ్వీరదించారు వేద పండితులు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ… సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని.. అధికారులతో చర్చించి 15 రోజులలో సర్వదర్శనం ప్రారంభిస్తామని పేర్కొన్నారు వైవి సుబ్బారెడ్డి.
కోవిడ్ తీవ్రత తగ్గే వరకు నిభందనలు పాటించవలసిందేనని… పర్యావరణ పరిరక్షణ కోసం ఘాట్ రోడ్లలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి. శ్రీ వారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్దాలతోనే ప్రసాదాలు సమర్పిస్తామన్నారు. త్వరలోనే కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని.. రాష్ర్టంలోని ఆలయాలకు ధూపదీప నైవేధ్యానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులుతో పురాతన ఆలయాలను పున:రుద్దరిస్తామని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ…దర్శనాలకు అనుమతులు ఇస్తామని వైవి సుబ్బారెడ్డి వివరించారు.